పెళ్లి చూపుల్లో అమ్మాయి, అబ్బాయి ఇద్దరికీ ఒకరినొకరు నచ్చారు. మరికొన్ని రోజుల్లో పెళ్లి చేయడానికి రెండు కుటుంబాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇలాంటి సమయంలో అమ్మాయి ఫేస్బుక్ అకౌంట్ నుంచి అబ్బాయికి విపరీతమైన మెసేజిలు వచ్చాయి.
తను మరొక వ్యక్తితో చేసిన చాట్ స్క్రీన్షాట్లు కూడా ఆమె తనకు కాబోయే భర్తకు పంపింది. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, వద్దని చెప్పాలని అబ్బాయిని కోరింది. ఈ మెసేజిలు చూసిన పెళ్లికొడుకు ఆశ్చర్యపోయాడు. నేరుగా అమ్మాయిని కలిశాడు.అతను చెప్పిన విషయం విని ఆ అమ్మాయి షాకైంది. తీరాచూస్తూ పెళ్లి కూతురి ఫేస్బుక్, జీమెయిల్ అకౌంట్స్ హ్యాక్ అయినట్లు తేలింది. దీనిపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చిన ఆమె.. తనతో కలిసి గతంలో పనిచేసిన వ్యక్తే ఈ పని చేసి ఉండొచ్చని చెప్పింది. తనకు అతను ప్రపోజ్ చేశాడని, తను నో చెప్పడంతో ఇలా చేస్తూ ఉండొచ్చని తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి