జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా హబీబుల్లా

ABN , First Publish Date - 2021-12-02T06:15:25+05:30 IST

జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన అధ్యక్షుడిగా హబీబుల్లా ఎంపికయ్యారు.

జిల్లా బాస్కెట్‌బాల్‌ సంఘం అధ్యక్షుడిగా హబీబుల్లా
నూతన అధ్యక్షుడిని సన్మానిస్తున్న సభ్యులు


అనంతపురం క్లాక్‌టవర్‌, డిసెంబరు 1 : జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన అధ్యక్షుడిగా హబీబుల్లా ఎంపికయ్యారు. స్థానిక అశోక్‌ నగర్‌లోని డీఎస్‌ఏ ఇండోర్‌స్టేడియంలో బుధవారం సాయంత్రం జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన సర్వసభ్య సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన జిల్లా నూతన అధ్యక్షు డిగా హబీబుల్లా, ఉపాధ్యక్షుడిగా రామకృష్ణారెడ్డి, కార్య వర్గసభ్యులుగా చంద్రశేఖర్‌, నరేష్‌రెడ్డిని ఏక గ్రీవంగా ఎన్నికున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరేంద్రచౌదరి తెలిపారు. ఇటీవల మరణించిన జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.  ఆ సంఘం జిల్లా సీనియర్‌ సభ్యులు బుగ్గయ్యచౌదరి తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-02T06:15:25+05:30 IST