Americaలో కొత్త పరిణామం.. గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా..

ABN , First Publish Date - 2021-12-04T00:05:41+05:30 IST

గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా అమెరికాలో హై టెక్ ఉద్యోగాలు చేసే హెచ్-1బీ వీసాదారుల సంఖ్య ఏకంగా 9 శాతం పడిపోయింది. గత పదేళ్లలో ఇంతటి తగ్గుదల ఎన్నడూ చూడలేదని అమెరికా కార్మిక శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్, మేథమెటిక్స్ చదివిన..

Americaలో కొత్త పరిణామం.. గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్:  గత పదేళ్లలో ఎన్నడూ చూడని విధంగా అమెరికాలో హై టెక్ ఉద్యోగాలు చేసే హెచ్-1బీ వీసాదారుల సంఖ్య ఏకంగా 9 శాతం పడిపోయింది. గత పదేళ్లలో ఇంతటి తగ్గుదల ఎన్నడూ చూడలేదని అమెరికా కార్మిక శాఖ పేర్కొంది. సెప్టెంబర్ 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇంజినీరింగ్, మేథమెటిక్స్ చదివిన హెచ్-1బీ వీసాదారుల సంఖ్య మునుపటి ఏడాదితో పోలిస్తే 12.6 శాతం మేర తగ్గింది. అంతేకాకుండా..ఈ తగ్గుదల కనిపించడం ఇది వరుసగా రెండో ఏడాదని కూడా కార్మిక శాఖ పేర్కొంది.  అమెరికాలో 2021 ఆర్థిక సంవత్సరంలో  వివిధ వీసా కేటగిరీల్లోని మొత్తం ఉద్యోగాల సంఖ్య 4,97,000. 2020 నాటి గణాంకాలతో పోలిస్తే ఇది 9 శాతం తక్కువ కాగా.. 2019తో పోలిస్తే ఏకంగా 17 శాతం తక్కువని గణాంక విశ్లేషణలో తేలింది. 


కరోనా కారణంగా అమెరికా ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణాలపై విధించిన ఆంక్షలే ఈ పరిణామానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా సంక్షోభం తొలి నాళ్లలో అమెరికా అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వివిధ వీసాలు కలిగిన విదేశీయులు తమ దేశంలోని రావద్దంటూ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అమెరికన్లు ఉద్యోగాలకు రక్షణ కల్పించేందుకే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి తోడు..కరోనా దెబ్బకు వివిధ దేశాల్లోని అమెరికా ఎంబసీలు మూతపడటం కూడా వీసాల జారీ ప్రక్రియకు బ్రేకులు వేసింది. 


అయితే.. హెచ్-1బీ వీసా కలిగిన అనేక మంది అమెరికాలో శాశ్వత నివాసార్హత పొంది కూడా ఉండొచ్చని ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సైరస్ డీ మెహతా పార్టనర్స్ కీలక అధికారి సైరస్ మెహతా వ్యాఖ్యానించారు. హెచ్-1బీ వీసా కలిగిన అనేక మంది గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుని ఉండొచ్చని కూడా ఆయన తెలిపారు. వారి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నంత కాలం కేవలం వర్క్ పర్మిట్లతోనే సరిపెట్టుకునేందుకు వారు సిద్ధమై ఉండొచ్చని కూడా తెలిపారు. హెచ్-1బీ వీసాపై జాబులు మారడం కంటే వర్క్ పర్మిట్లపై ఉద్యోగాలు మారడం సులభమని హెచ్-1బీ వీసాదారులు భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.  

Updated Date - 2021-12-04T00:05:41+05:30 IST