కొత్త కండోమ్స్..మగాళ్లు, మగువలు ఇద్దరూ వాడొచ్చు..!

ABN , First Publish Date - 2021-10-29T04:41:04+05:30 IST

మగాళ్లు, మగువలు ఇద్దరూ వినియోగించగలిగే కొత్త రకం యూనీసెక్స్ కండోమ్స్ తయారు చేశానంటూ మలేషియాకు చెందిన జాన్ టాంగ్ అనే ఓ గైనెకాలజిస్టు తాజాగా ప్రకటించారు.

కొత్త కండోమ్స్..మగాళ్లు, మగువలు ఇద్దరూ వాడొచ్చు..!

ఇంటర్నెట్ డెస్క్: మగాళ్లు, మగువలు ఇద్దరూ వినియోగించగలిగే కొత్త రకం యూనీసెక్స్ కండోమ్స్ తయారు చేశానంటూ మలేషియాకు చెందిన జాన్ టాంగ్ అనే ఓ గైనెకాలజిస్టు తాజాగా ప్రకటించారు. గాయాలకు కట్టుకట్టేందుకు ఉపయెగించే డ్రెస్సింగ్ మెటీరీయల్స్‌ తయారీలో వాడే పదార్థాలతోనే దీన్ని తయారు చేశానని ఆయన ప్రకటించారు. మెడికల్ ఉత్పత్తులు తయారు చేసే ట్విన్ కాటలిస్ట్ సంస్థలో ఆయన పనిచేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్‌  నుంచీ ఇవి మార్కెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ కండోమ్‌పై జరిపిన క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయని, ఇది మార్కెట్లోకి వచ్చాక సురక్షిత శృంగారానికి, అవాంఛిత గర్భ నిరోధానికి ఓ మంచి ఉపకరణంగా మారుతుంది ఆ డాక్టర్ చెప్పారు. 

Updated Date - 2021-10-29T04:41:04+05:30 IST