విశాఖపట్నం: త్వరలోనే విశాఖను చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని జీవీఎంసీ కమిషనర్ సృజన తెలిపారు. త్వరలోనే అన్ని సచివాలయాలకు కలిపి 620 వాహనాలు వస్తున్నాయన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని సృజన సూచించారు. పీఓపీ విగ్రహాలు వినియోగించ వద్దన్నారు. సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ సృజన పేర్కొన్నారు.