ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జీవీఎల్

ABN , First Publish Date - 2022-04-23T20:48:17+05:30 IST

నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు.

ఆ రెండు పత్రికలపై రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చిన జీవీఎల్

న్యూఢిల్లీ: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలపై బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు రాజ్యసభలో ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తప్పుడు వార్తలు ప్రచురించారని అందుకే ప్రివిలేజ్ నోటీసు ఇచ్చినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా సాయం చేస్తున్నా.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు విమర్శిస్తున్నాయని, మంత్రి కేటీఆర్ హద్దు మీరి ప్రధానిపై వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అంటే భయంతోనే కేటీఆర్ వ్యాఖ్యలు చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి కుటుంబపార్టీల నుంచి ముప్పు ఉందని, కుటుంబపార్టీల పాలన దూరం చేసేలా.. 2024 ఎన్నికల ఎజెండాను ప్రధాని మోదీ ఖరారు చేశారని జీవీఎల్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-04-23T20:48:17+05:30 IST