Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించింది: జీవీఎల్

twitter-iconwatsapp-iconfb-icon
ఏపీకే కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించింది: జీవీఎల్

ప్రకాశం జిల్లా: దేశంలోని అన్ని రాష్ట్రాలకన్నా ఏపీకే  కేంద్రం ఎక్కువ నిధులు కేటాయించిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో పథకాలకు తమ పేర్లు పెట్టుకుని సొంత డబ్బాలు కొట్టుకుంటోందని విమర్శించారు. కరోనా సమయంలో కేంద్రం 20 నెలల పాటు ఉచిత బియ్యాన్ని ప్రజలకు పంపిణీ చేసిందన్నారు. గత ఆరేళ్లలో 24 వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద ఏపీకి కేంద్రం ఇచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఏమి చేసిందన్న దానిపై వైసీపీతో చర్చకు బీజేపీ సిద్ధమన్నారు. అబద్దాలు ప్రచారాలు చేసి వైసీపీ, టీడీపీ పార్టీలు ప్రజలను మభ్య పెడుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం సాయం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందుతాయని జీవీఎల్ పేర్కొన్నారు.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.