Oct 26 2021 @ 21:25PM

స్టూడియో గ్రీన్‌కు ‘జెయిల్‌’ రిలీజ్‌ రైట్స్‌

జి. వసంత్‌బాలన్‌ దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌ హీరోగా నటించి, సంగీతం సమకూర్చిన ‘జెయిల్‌’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ సొంతం చేసుకుంది. నిర్మాణ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని ఆ స్టూడియో అధినేత జ్ఞానవేల్‌ రాజా ఇటీవల చూశారు. ఆ తర్వాత తానే ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ‘జెయిల్‌’ మూవీని క్రిక్స్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మాత శ్రీధరన్‌ మరియ దాస్‌ నిర్మించారు. గతంలో ‘వెయిల్‌’, ‘అంగాడి తెరు’, ‘అరవాన్‌’, ‘కావ్యతలైవన్‌’ వంటి విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జి. వసంత్‌బాలన్‌ ఇప్పుడు ‘జెయిల్‌’ చిత్రానికి స్వయంగా కథను సిద్ధం చేసి డైరెక్ట్‌ చేశారు. హీరో జీవీ ప్రకాష్‌ సరసన ‘తేన్‌’ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన అపర్ణతి నటిస్తుంటే.. రాధికా శరత్‌కుమార్‌, పసంగ పాండి, నందన్‌ రామ్‌, రవి మరియా తదితరులు ఇతర కీలక పాత్రలను పోషిస్తున్నారు. చిత్ర విడుదల తేదీని నిర్మాతలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Otherwoodsమరిన్ని...