Advertisement
Advertisement
Abn logo
Advertisement

జగన్ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేదు: జీవీ

గుంటూరు జిల్లా: వినుకొండ బీజేపీ అధ్యక్షుడు రమేష్‌ను టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జీ.వీ.ఆంజనేయులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ సురేష్ మహల్ రోడ్డు ఆక్రమణ తొలగింపుపై రమేష్ పోరాటం చేశారన్నారు. శివాలయం కూల్చివేశారని కోర్టుకు వెళ్తే  చంపుతారా? అంటూ ప్రశ్నించారు. జగన్ పాలనలో ప్రతిపక్ష నేతలకు రక్షణ లేదని, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై మున్సిపల్ కమిషనర్ దాడి చేయించారని రమేష్ ఆరోపిస్తున్నారన్నారు. దాడి వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోందని, దాడి వెనుక ఉన్న సూత్రధారులు, పాత్రదారులను పోలీసులు బయటపెట్టాలని జీవీ ఆంజనేయులు డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement