రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-05-18T16:08:53+05:30 IST

రాష్ట్రంలో పోలీసులకు..

రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన

గుంటూరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పోలీసులకు చట్టాలంటే గౌరవం లేదని.... కోర్టు అదేశాలంటే లెక్కలేకుం డా పోయిందని నరసరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. సోమవారం ఆయన అన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. సీఎం జగన్‌ నేతృత్వంలో రాష్ట్రంలో యథేచ్చగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఎంపీ రఘురామకృష్ణ రాజును హైదరాబాదులో గూండాల్లా వెళ్లి అక్రమంగా అరెస్ట్‌ చేయడం, గుంటూరులో సీఐడీ పోలీసు లు కర్కశంగా లాఠీచార్జీ ప్రయాగించడం, కోర్టు అదేశాలను లెక్కచేయకుండా జైలు కు తరలించండం చూస్తుంటే ఓ ఫ్యాక్షన్‌ సినిమాను తలపిస్తోందన్నారు. దీనినిబట్టి రాష్ట్రంలో పోలీసులు డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయ డం మానేసి జగన్‌ డైరక్షన్‌లో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టమ వుతోందని తెలిపారు. ఇటువంటి అవాంఛనీయ, అమానవీయ ఘటనలు దేశంలో ఇదివరకెన్నడూ చూడలేదన్నారు. ఏపీలో ఆవరించిన కరోనా వైరస్‌కంటే కక్షల రాజకీ యం ప్రమాదమని... విమర్శని సైతం సహించలేని ఆందోళనకర వాతావరణం నెల కొందని వివరించారు. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు వ్యవస్థను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటు న్నారని దుయ్యబట్టారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఖచ్చితంగా సీఐడీ పోలీసులు కోర్టు దిక్కరణ చర్యలను ఎదుర్కొక తప్పదన్నారు. ఇటువంటి అనాగరికి చర్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోందని  ఆంజనేయులు స్పష్టం చేశారు. 

Updated Date - 2021-05-18T16:08:53+05:30 IST