అతడిని మిస్‌ అవుతున్నా..!

ABN , First Publish Date - 2020-04-01T10:03:21+05:30 IST

బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో తాము వివాహం చేసుకోబోతున్నట్టుగా జ్వాల ఇటీవల ప్రకటించింది. జోరుగా హుషారుగా సాగుతున్న వీరి లవ్వాటకు కరోనా బ్రేకు లేసింది.

అతడిని మిస్‌ అవుతున్నా..!

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలో తాము వివాహం చేసుకోబోతున్నట్టుగా జ్వాల ఇటీవల ప్రకటించింది. జోరుగా హుషారుగా సాగుతున్న వీరి లవ్వాటకు కరోనా బ్రేకు లేసింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రియుడికి దూరం కావడంతో జ్వాలకు రోజులు భారంగా గడుస్తున్నట్టున్నాయి..! దీంతో ‘మిస్సింగ్‌ మై..’ అని జ్వాల ట్వీట్‌ చేయగా.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక దూరం ఎంతో ముఖ్యం. అందరి కోసం ప్రార్థించు’ అని విశాల్‌ రిప్లయ్‌ ఇచ్చాడు.

Updated Date - 2020-04-01T10:03:21+05:30 IST