Apr 13 2021 @ 15:03PM

విష్ణు విశాల్‌తో పెళ్లి డేట్‌ అనౌన్స్‌ చేసిన గుత్తా జ్వాల

కోలీవుడ్‌ నటుడు విష్ణు విశాల్‌, బ్యాడ్మింటన్‌ స్టార్‌ గుత్తా జ్వాల మధ్య కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగుతుంది. ఈ విషయంపై వీరిద్దరూ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేశారు. గత ఏడాది సెప్టెంబర్‌లో స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా వీరిద్దరూ ఓ ఇంటివారు కాబోతున్నారు. గుత్తాజ్వాల తన సోషల్ మీడియా అకౌంట్‌ ద్వారా విష్ణు విశాల్‌ను పెళ్లి చేసుకుంటున్నట్లు అధికారికంగా తెలిపారు. ఏప్రిల్‌ 22న విష్ణు విశాల్, గుత్తా జ్వాల పెళ్లి చేసుకోబోతున్నారు. ఇది వరకు విష్ణు విశాల్‌కు రజినీ అనే అమ్మాయితో 2010లో పెళ్లి అయ్యింది. అయితే మనస్పర్ధల కారణంగా వీరు 2018లో విడిపోయారు. అలాగే చేతన్‌ ఆనంద్‌ను 2010లో పెళ్లి చేసుకున్న గుత్తా జ్వాల 2011లోనే అతన్నుంచి విడిపోయింది.