Abn logo
Sep 29 2020 @ 01:40AM

రూ. 15 లక్షల విలువ చేసే గుట్కా పట్టివేత

నిజామాబాద్‌ రూరల్‌/ఖిల్లా, సెప్టెంబరు 28: 

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు వలపన్ని మరోసారి పెద్ద మొత్తంలో గుట్కా పాకెట్లు పట్టుకున్నారు. నగరంలోని ఆటోనగర్‌ పరిధిలోని ఓ గోదా ంలో రహస్యంగా గుట్కా పాకెట్లు అక్రమంగా నిల్వ చేశారని పోలీసులకు స్థానికులు ఉప్పందించారు. సమాచారం రూఢీచేసుకున్న నిజామాబాద్‌ స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు 6వ పట్టణ ఎస్‌హెచ్‌వో గౌరీందర్‌ బృందంతో కలిసి గోదాంపై నిఘా ఉంచారు. ఏడీ కంపెనీ గుట్కాను కంటెయినర్‌లలో ఎవరికి అనుమానం రాకుండా తీసుకువచ్చినట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం లభించింది.


ఉదయం దుకాణం షెట్టర్‌ తెరవగానే ఎస్‌బీ బృందం, స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులు, స్థానిక 6వ పట్టణ ఎస్‌హెచ్‌వో బృందం కలిసి ఒకేసారి దాడులు చేసి సోదాలు నిర్వహించ గా గోదాంలో రహస్యంగా దాచి ఉంచిన 26 గుట్కా బ్యాగ్‌లను లభించాయి. వాటి విలువ మార్కెట్‌లో సుమారు రూ.15 లక్షలకు పైగా ఉన్నట్లు సమాచారం. గోదాం యజమాని కరీం కాగా.. దీన్ని నిర్వహిస్తున్నది అబ్దుల్‌ ఘనీ అనే వ్యక్తిగా తేలింది. గోదాం నిర్వాహకులంతా పరారీలో ఉన్నారని, కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు 6వ పట్టణ ఎస్‌హెచ్‌వో గౌరీందర్‌ తెలిపారు.

Advertisement
Advertisement