గుట్కాకు అడ్డుకట్టేది..?

ABN , First Publish Date - 2022-01-25T05:00:19+05:30 IST

జిల్లాలో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది. ఎన్నిసార్లు పట్టుబడినా వ్యాపారుల తీరులో మార్పు రావడం లేదు.

గుట్కాకు అడ్డుకట్టేది..?
ఇటీవల పెబ్బేరులో పట్టుబడిన గుట్కా ప్యాకెట్లు

- జిల్లాలో జోరుగా దందా

- పట్టుబడుతున్నా మారని వ్యాపారుల తీరు 

వనపర్తి క్రైమ్‌, జనవరి 24 : జిల్లాలో గుట్కా దందా జోరుగా కొనసాగుతోంది. ఎన్నిసార్లు పట్టుబడినా వ్యాపారుల తీరులో మార్పు రావడం లేదు. మసాలా మాటున పెద్దఎత్తున గుట్కా దందా కొనసాగుతోంది. పైకి మసాలా దండలు కనిపించేలా వేసి లోపల మాత్రం పొ గాకు ఉత్పత్తులను ఉంచి విక్రయిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం చిన్నచిన్న వ్యాపా రులను మాత్రమే పట్టుకొని హడావిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలైన బడా వ్యాపారులతో నెలానెలా మామూళ్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెలువెత్తుత్తున్నాయి. 
 తనిఖీల్లో చిన్న దుకాణాలపైనే దాడులు అధికం
గత నెలక్రితం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ఉన్నతాధికారులు పొగాకు, గంజాయి ఉత్ప త్తులపై దృష్టి సారించారు. ఆ దాడుల్లో అధికారులు బడా వ్యాపారులను దాచిపెట్టి చిన్నచిన్న వ్యాపారులపైనే దాడులు చేశారనే ఆరోపణలు వినిపించాయి. చిన్నచిన్న దుకాణాలకు సరఫరా చేసే బడా వ్యాపారులను వదిలేసి పదుల సంఖ్యలో ప్యాకెట్లు అమ్ముకునే వారిపై కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దందా అంతా అధికారుల కనుసన్నల్లోనే నడు స్తుందనేది ప్రధానమైన ఆరోపణ. 

 కర్ణాటక టు వనపర్తి
జిల్లాకు వచ్చే గుట్కా సరఫరా కర్ణాటక నుంచే ఎక్కువగా సరఫరా అవుతోంది. గుట్కా పట్టుబడినప్పుడు పట్టుకున్న వ్యక్తులను ఆరా తీస్తే అక్కడి నుంచే తెచ్చి విక్రయిస్తున్నట్లు వారు ఒప్పుకున్నారు. ఎక్కువ సంఖ్యలో అక్రమార్జనకు అలవాటుపడిన కొందరు కార్లు, మోటర్‌సైకి ళ్లపై జిల్లాకు తరలించి, ఒకచోట డంపు చేసి జిల్లాకు సమీపంలోని పలు ప్రాంతాలకు సర ఫరా చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని కమాన్‌ చౌరస్తాలో ఉన్న ఐదారుగురు వ్యాపా రులే ఈ దందాను ఎక్కువగా నిర్వహిస్తున్నట్లు సమాచారం. వారే ప్రధానంగా కర్ణాటక, రా యచూర్‌ నుంచి సరుకును తెచ్చి ఇక్కడ అధిక రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. గ్రామీణ ప్రాంతాల్లోని దుకాణాదారులకు ఒక్కో ప్యాకెట్‌పై అదనంగా రూ.200 నుంచి రూ.300 వరకు తీసుకుని విక్రయిస్తున్నట్లు సమాచారం. 

 అధికారుల తీరుపై ఆరోపణలు 
ఈ దందాలో పలువురు పోలీస్‌ అధికారులకు నెలవారీ మామూళ్లు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత బడా వ్యాపారులు దందా చేస్తున్నారని తెలిసినా వారిపై ఎలాంటి నిఘా పెట్టకుండా వదిలేయడం, పట్టుబడినప్పుడు వారి వివరాలను గోప్యంగా  ఉంచడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జిల్లాలోని పెబ్బేరు, వనపర్తి పట్టణం, ఆత్మకూర్‌, అమరచింత, కొత్తకోట మండలాల్లో జోరుగా గుట్కా విక్రయిస్తున్నారు. గత ఏడాది 2021లో 50కి పైగా కేసులలో ఈ మండలాల్లోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. వనపర్తి, కొత్త కోటలోనే అధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆయా మండలాల ఎస్సైల కనుసన్నల్లోనే ఈ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎన్నిసార్లు గుట్కా నిషేధంపై అధి కారులు దాడులు నిర్వహించినా ఈ దందాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక నిఘా ఉంచి గుట్కాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-25T05:00:19+05:30 IST