జోరుగా గుట్కా దందా

ABN , First Publish Date - 2022-01-19T06:48:14+05:30 IST

ఓ వైపు నిషేదిత గుట్కా వ్యా పారంపై పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ మరో వైపు అక్రమ వ్యాపా రం జగిత్యాల జిల్లాలో జోరుగా కొనసాగుతోంది.

జోరుగా గుట్కా దందా

ఫైల్‌ నం.05జెజిటి18


మెట్‌పల్లిలో పట్టుకున్న గుట్కాతో పోలీసులు-(12జెజిటి18)

కోరుట్లలో పట్టుకున్న గుట్కాతో పోలీసులు-(13జెజిటి18)

ధర్మపురిలో పట్టుకున్న గుట్కాతో పోలీసులు-(14జెజిటి18)

జగిత్యాలలో ఓ దుకాణంలో సోదాలు చేస్తున్న పోలీసులు-(15జెజిటి18)

జగిత్యాలలో పట్టుకున్న గుట్కాతో పోలీసులు-(16జెజిటి18)

జగిత్యాలలో గుట్కాతో పట్టుపడ్డ కారు-(17జెజిటి18)


జిల్లాలో పాతుకుపోయిన అక్రమార్కులు

 రూ. కోట్లలో వ్యాపారం....పట్టుబడేది రూ. లక్షల్లో

జగిత్యాల, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఓ వైపు నిషేదిత గుట్కా వ్యా పారంపై పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ మరో వైపు అక్రమ వ్యాపా రం జగిత్యాల జిల్లాలో జోరుగా కొనసాగుతోంది. దాడులు జరుగుతు న్నావ్యాపారులు తమ ధోరణిని విడనాడడం లేదు. గుట్కా వ్యాపారం లో కొన్నేళ్లుగా పాతుకుపోయిన పలువురు అక్రమార్కులు యథేచ్చగా త మ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. వ్యవహారం బహిర్గతం అయి నప్పుడు గానీ, ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు గానీ, వి వాదాస్పదం అయినప్పుడు గానీ గుట్కా వ్యాపారంపై కన్నెర్ర చేస్తున్నా రు. తదుపరి ‘మాములు’గానే తీసుకుంటుండడంతో అక్రమార్కులు ఆ డింది ఆటగా మారింది. రూ. కోట్లలో వ్యాపారం జరుగుతుంటే పోలీ సులకు పట్టుబడుతున్నవి కేవలం రూ. లక్షల సరుకు మాత్రమే.  జ గిత్యాల జిల్లాకు ప్రధానంగా మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతం నుంచి గుట్కాను అక్రమంగా దిగుమతి చేస్తున్నారు. 

యథేచ్ఛగా సాగుతున్న దందా...

జగిత్యాల జిల్లాలో గుట్కా వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. అక్రమార్కులు సరికొత్త ఎత్తుగడలతో పోలీసులకు చిక్కకుండా తప్పిం చుకుంటున్నారు. గతంలో గోదాముల్లో భారీగా నిల్వలు ఉంచి, చిరు వ్యా పారులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం సంబంధిత వ్యాపారి ఫోన్‌కు మేసేజ్‌ చేస్తే చాటు సరుకును నేరుగా దుకాణాల వద్దకే బైక్‌లపై, ఇతర వాహనాలపై చేరవేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాని రహస్య ప్రాం తాల్లో గోదాములను నిర్వహించుకుంటున్నారు. పోలీసు ఉన్నతాధికారు లు దర్యాప్తు చేసినా పట్టుబడ కుండా సాంకేతికను ఉపయోగిస్తున్నా రు. గతంలో హైద్రాబాద్‌ నిజామాబాద్‌, నిర్మల్‌, అదిలాబాద్‌ నుంచి గు ట్కాను తెప్పించేవారు. ప్రస్తుతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాం తాల మీదుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పక్కా ప్రణాళికతో మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల మీదుగా గుట్కాను తెప్పిస్తున్నారు. 

రాత్రి వేళల్లో పెద్ద ఎత్తున రవాణా...

నిషేదిత గుట్కాను అర్ధరాత్రి సమయంలో మహారాష్ట్ర, నిర్మల్‌, నిజామాబాద్‌ నుంచి జగిత్యాల జిల్లాకు తెప్పిస్తున్నారు. మహారాష్ట్ర, నిర్మ ల్‌, నిజామాబాద్‌ల నుంచి వాహనం బయలుదేరిన వెంటనే వాట్సప్‌ మెసేజ్‌ ద్వారా ఇక్కడి వ్యాపారులకు సమాచారం అందిస్తారు. ప్రణాళిక ప్రకారమే సరుకు నిర్ధేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. తదుపరి వ్యాపా రులు ద్విచక్ర వాహనంపై వెళ్లి సరుకును తెచ్చుకోవడం, మరికొన్ని సం దర్భాల్లో అక్రమ వ్యాపారులే చిరు వ్యాపారులకు సరుకును చేరవేస్తారు. ప్రధానంగా మహారాష్ట్ర, నిజామాబాద్‌, నిర్మల్‌ నుంచి పలు రకాల బ్రాం డ్‌లతో తయారు చేసిన గుట్కా ప్యాకెట్లు సరాఫరా అవుతుండగా కర్ణాట కలోని బీదర్‌ ప్రాంతం నుంచి రాణి పేరుతో తయారు చేసిన గుట్కా జగిత్యాల జిల్లాకు దిగుమతి అవుతున్నట్లు తెలుస్తోంది.

పోలీసుల కట్టడి పేరుతో దోపిడీ...

గుట్కా వ్యాపారంపై పోలీసులు కన్నెర్ర చేసిన సందర్బాల్లో దోపిడీ మరింత అధికమవుతోంది. పోలీసులు పకడ్బందిగా వ్యవహరిస్తున్నారని, కట్టడి ఎక్కువ చేస్తున్నారన్న సాకులతో అధిక ధరలకు విక్రయిస్తున్నా రు. చిరు వ్యాపారుల వద్ద నిల్వలు పూర్తిగా అడుగంటుతున్న సంద ర్భాల్లో చాకచక్యంగా అక్రమార్కులు తమకు అనుకూలంగా మలుచుకుం టున్నారు. గతంలో లాక్‌డౌన్‌ సాకుతో సైతం అధిక ధరలకు విక్రయాలు జరిపి రూ. లక్షలను గడించారు. గతంలో అంబర్‌ ప్యాకెట్‌ గుట్కా ధర రూ. 180 నుంచి రూ. 600 వరకు విక్రయించారంటే దోపిడీ ఏ రకంగా ఉందో అర్థమవుతోంది. అదేవిధంగా సాగర్‌, తోట వంటి గుట్కా ప్యాకె ట్లను సైతం పోలీసుల కట్టడి పేరుతో అమాంతం పెంచి అమ్ముతుంటారు. 

తీగలాగితే కదులుతున్న డొంక...

జగిత్యాల జిల్లాలో ఇటీవల గుట్కా వ్యాపారంపై పోలీసులు తీగలా గడంతో డొంక కదులుతోంది. జగిత్యాల గాంధీనగర్‌ వద్ద గుట్కాతో వెళ్తున్న ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. రూ. 5 లక్షల విలువ గల నిషే దిత గుట్కాను పట్టుకున్నారు. సంఘటనలో పట్టపడ్డ ఇమ్రాన్‌ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు నిర్మల్‌కు వెళ్లి అక్కడి షఫీక్‌ అహ్మద్‌ అను వ్యాపారి వద్ద ఉన్న మరో రూ. 4 లక్షల విలువ గల గుట్కాను పట్టుకున్నారు.  

పట్టుబడుతోంది పాత్ర దారులే... సూత్రదారులు కాదు...

జిల్లాలో గుట్కా గుట్టుగా స్మగ్లింగ్‌ అవుతోంది. జిల్లాలో పోలీసులకు పట్టుపడుతోంది కేవలం పాత్ర దారులే తప్ప సూత్ర దారులు కాదన్న అభిప్రాయాలున్నాయి. ఒక్కో సందర్భాల్లో ఒక్కో ప్రాంతంలో గుట్కా బ యటపడటం, పట్టుబడటం జరుగుతోంది. పోలీసులు పట్టుపడుతోంది కేవలం ప్రాతదారులేనని, సూత్ర దారులు ఎప్పటిమాదిరిగానే తెరవెనుక ఉండి అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తు న్నాయి.  

ఇటీవల జరిగిన సంఘటలు.. 

 కోరుట్లలో అక్రమంగా నిల్వ ఉంచి రూ. 6.37 లక్షల విలువ గల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు.

ఫ మెట్‌పల్లి సర్కిల్‌ పరిధిలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిం చి రూ. 1.5 లక్షల విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. 38 దుకాణాల్లో సోదాలు చేసి పది మందిపై కేసు నమోదు చేశారు. 

ఫ గొల్లపల్లిలో రూ. 6,350 విలువ గల గుట్కాను స్వాధీనం చేసుకొని వ్యాపారిపై కేసు నమోదు చేశారు.

ఫ మల్యాలలో రూ. 3.15 వేల విలువ గల గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల, కొండగట్టులకు చెందిన ఇరువురు వ్యాపారు లపై కేసు నమోదు చేశారు.

ఫ ధర్మపురిలో రూ. 40 వేల విలువ గల గుట్కాను పోలీసులు పట్టుకున్నారు.

ఫ జగిత్యాలలో రూ. 30 వేల విలువ గల గుట్కాను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2022-01-19T06:48:14+05:30 IST