రూ.12లక్షల విలువైన గుట్కా పట్టివేత

ABN , First Publish Date - 2021-10-27T05:40:39+05:30 IST

కర్నాటక రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.12లక్షల విలువైన నిషేధిత గుట్కాను మంగళవారం ఉదయం నిజామాబాద్‌ నగరంలోని వర్నిరోడ్డులో ఐదో టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు.

రూ.12లక్షల విలువైన గుట్కా పట్టివేత
పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లు

ఖిల్లా, అక్టోబరు 26: కర్నాటక రాష్ట్రం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న సుమారు రూ.12లక్షల విలువైన నిషేధిత గుట్కాను మంగళవారం ఉదయం నిజామాబాద్‌ నగరంలోని వర్నిరోడ్డులో ఐదో టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్‌ ఏసీపీ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మంగళవారం ఉదయం వర్నిరోడ్డులో ఉత్తర మండలం రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ గురునాథ్‌, ఎస్‌ఐ రాజేశ్వర్‌గౌడ్‌ తమ సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ ఐచర్‌ వాహనం అనుమానాస్పదంగా వెళ్తుండడంతో ఆ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. కోళ్ల దాణా బస్తాల కింద 40 బస్తాల నిషేధిత గుట్కా బ్యాగులు ఉండడాన్ని గుర్తించారు. వెంటనే వాహనాన్ని స్వాధీనం చేసున్నారు. కాగా.. ఈ వాహనం కర్నాటక రాష్ట్రంలోని బీదర్‌ జిల్లా హుమ్నాబాద్‌ నుంచి వస్తోందని, నిజామాబాద్‌తో పాటు బోధన్‌, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు గుట్కాను తరలిస్తున్నట్టు ప్రాథమిక విచారణలో తెలిసిందని ఏసీపీ తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని అసలు నిందితుల కోసం లోతుగా విచారణ చేస్తున్నామన్నారు.

Updated Date - 2021-10-27T05:40:39+05:30 IST