Abn logo
Sep 22 2021 @ 00:14AM

మహిళాభ్యున్నతికి పాటుపడిన గురజాడ

మాట్లాడుతున్న రమాదేవి

ఒంగోలు(కల్చరల్‌), సె ప్టెంబరు 21: సమాజం పు రోగతి సాధించేందుకు మ హిళా అభ్యున్నతి అవసర మని గుర్తించిన మహాకవి గురజాడ అప్పారావు అని, అందుకోసం తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్య పరిచారని ఐద్వా నగర కా ర్యదర్శి కంకణాల రమాదేవి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సత్యనారాయణ పురంలో గురజాడ అప్పారావు జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ మె మాట్లాడుతూ గురజాడ అప్పారావు దేశంలోని మూఢనమ్మకాల అంతం కో సం పోరాడారన్నారు.  కన్యాశుల్కం, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి రచనల ద్వారా బాల్యవివాహాలను రూపుమాపటానికి కృషి చేశారని కొనియాడారు. జి.ఆదిలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీహెచ్‌.రమాదేవి, జి.కళ్యాణి, బి.గోవిందమ్మ, వై.సృజన, తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేశభక్తి గీతాలు ఆలపించిన ప లువురు బాలబాలికలకు బహుమతులు అందజేశారు.