భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T06:33:22+05:30 IST

జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
వేములవాడలో సాయిబాబాను దర్శించుకుంటున్న భక్తులు

- సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు

వేములవాడ, జూలై 24: జిల్లాలో గురు పౌర్ణమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వేములవాడ శ్రీషిర్డీ సాయిబాబా ఆలయం భక్తులతో సందడిగా మారింది. ఉదయం 5.30 గంటల నుంచి దర్శనం ప్రారంభం కాగా, పట్టణానికి చెందిన భక్తులు శ్రీసాయిబాబాను దర్శించుకుని తరించారు. కొవిడ్‌ ఆంక్షల కారణంగా స్వామివారి ప్రత్యేక పూజలు అంతర్గతంగా నిర్వహించారు. సేవా సంస్థాన్‌ ట్రస్టు అధ్యక్షుడు వారాల దేవయ్య, ఉపాధ్యక్షుడు కొనమ్మగారి నాగరాజు, కార్యదర్శి గంప రాజేందర్‌, బండారి కుమార్‌, కూర రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

- సిరిసిల్ల ఎడ్యుకేషన్‌: గురుపౌర్ణమిని పురస్క రించుకొని పట్టణంలోని  సాయిబాబా దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు ఆలయంలోని ఆవరణలో సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు చేయ డంతో పాటు కరోనా నిబంధనలతో భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. పట్టణంలోని బీవైనగర్‌ హనుమాన్‌ దేవాలయంలో గీతా ప్రచార సేవా సమి తి ఆధ్వర్యంలో గురుపౌర్ణమి వేడుకలను నిర్వహించా రు.  సేవా సమితి అధ్యక్షుడు నారాయణ, ఆలయ క మిటీ అధ్యక్షుడు మోతీలాల్‌ను ఘనంగా సన్మానిం చారు.  కార్యక్రమంలో జనపాల శంకరయ్య, భక్తులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-25T06:33:22+05:30 IST