భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T06:32:23+05:30 IST

గురుపౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు
3వ రోడ్డు ఆలయంలో సాయిబాబాకు ప్రత్యేక ప్రత్యేక పూజలు చేస్తున్న దృశ్యం

-షిర్డీసాయినాథుడి దర్శనానికి క్యూకట్టిన భక్తులు

అనంతపురం టౌన, జూలై 24: గురుపౌర్ణమిని పురస్కరించుకుని శనివారం జిల్లావ్యాప్తంగా వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కరోనా నివారణ దృష్ట్యా ఆలయాల్లో సామూహిక పూజలు, వ్రతా లు, అన్నదాన కార్యక్రమాలు, నగరోత్సవాలను ఆయా ఆలయాల నిర్వాహకులు రద్దు చేశారు. కానీ భక్తులు మాస్కులు ధరించి ఆలయాలకు వెళ్లి సాయినాథుడిని దర్శనానికి క్యూ కట్టారు. జిల్లాకేంద్రంలో ఆదిమూర్తినగర్‌లోని వేమనభవన ఎదురుగా ఉన్న షిర్డీసాయి ఆలయం, చెరువుకట్ట బాబా మందిరం, వేణుగోపాల్‌నగర్‌ సద్గురు సాయినాథ మందిరం, పా తూరు దత్తమందిరం, మూడోరోడ్డులోని షిర్డీసాయి ఆలయం, రామచంద్రనగర్‌లోని సాయినాథ మందిరం, సోమనాథ్‌నగర్‌లోని షిర్డీసాయి ఆలయాల్లో వేడుకలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయినాథుడి మూ లవిరాట్లకు వివిధ అభిషేకాలు చేసి, విశేష అలంకరణ, పూజా కైంకర్యాలు నిర్వహించారు. పాతూరు దత్త మందిరంలో దత్తాత్రేయస్వామి మూ లవిరాట్‌కు ప్రత్యేక పూజలు, వ్యాసపూజ, దత్తహోమం నిర్వహించారు.

సద్గురు సాయినాథమందిరంలో అహుడా చైర్మన పూజలు

తమకు నూతనంగా పదవులు దక్కిన సందర్భంగా అహుడా చైర్మన మహాలక్ష్మి శ్రీనివాస్‌, ఏడీసీసీ బ్యాంకు చైర్‌పర్సన లిఖిత శనివారం సాయం త్రం వేణుగోపాల్‌నగర్‌లోని సద్గురు సాయినాథ మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది వారికి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకుడు పామిడి వీరాంజనేయులు, రంగనాయకులు, నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.

బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని చెరువుకట్టపై వెలసిన షిర్డీసాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకుని శనివా రం ప్రత్యేక పూజలు చేశారు. బాబా దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ అధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేప ట్టారు.  కరోనా నేపథ్యంలో భక్తులు భౌతిక దూరం పాటిస్తూ ఆలయం లోకి వెళ్లేలా ఆలయ కమిటీ, పోలీసులు ఏర్పాట్లు చేశారు. స్థానిక ఎమ్మె ల్యే జొన్నలగడ్డ పద్మావతి , ఆమె కుటుంబ సభ్యులు స్వామిని సందర్శిం చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్వర్యంలో ఎమ్మెల్యేకు బాబా చిత్ర పటం ఇచ్చి, శాలువాతో సత్కరించారు. 

గార్లదిన్నె : మండల కేంద్రమైన గార్లదిన్నె, మండలంలోని కల్లూరు, కోటంక గ్రామాల్లో షిర్డీసాయిబాబా ఆలయాల్లో స్వామి వారికి అభిషేకాలు,  పూజలు చేపట్టారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు.   

రాప్తాడు: మండలంలోని హంపాపురం సమీపాన గల మౌనగరి హ నుమత క్షేత్రంలో.. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా చిత్రపటం, ఆంజ నేయస్వామి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. చుట్టు పక్కల గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భజనలు, అన్నదాన కార్యక్రమా లు చేపట్టారు. మౌనగిరి వ్యవస్థాపకులు ఈశ్వరయ్య పాల్గొన్నారు.

శింగనమల : మండలంలోని శింగనమల చెరువుకట్టపై వెలసిన షిర్డీసాయి మందిరంలో బాబాకు ప్రత్యేక అలంకారం, పూజలు చేశారు.  పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.

ఆత్మకూరు : మండల కేంద్రంలోని షిర్డీసాయిబాబా ఆలయం లో బాబా మూలవిరాట్టును ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు చేశారు. స్వామి వారి దర్శనం కోసం పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు.  ఆలయ కమిటీ చైర్మన చంద్రశేఖర్‌ రెడ్డి, సభ్యులు  పాల్గొన్నారు.

రామగిరి: మండలకేంద్రంలోని షిర్డీసాయిబాబా ఆలయంలో సా యినాథుడిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. రామగిరితో పాటు చుట్టుపక్కల గ్రామస్థులు బాబాను దర్శించుకుని పూజలుచేశారు.

కనగానపల్లి: మండలంలోని మామిళ్లపల్లి షిర్డీసాయిబాబా నూతన ఆ లయంలో  సాయిబాబా విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చే శారు. పెద్దఎత్తున భక్తులు తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. 


Updated Date - 2021-07-25T06:32:23+05:30 IST