Abn logo
Jul 24 2021 @ 23:46PM

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

పోంచపల్లి : సాయిబాబా ఆలయంలో పూజలు చేస్తున్న భక్తులు

భువనగిరి టౌన / గుండాల / వలిగొండ / యాదాద్రి రూరల్‌ / భూదానపోచంపల్లి / ఆలేరు : జిల్లావ్యాప్తంగా భక్తులు గురు పౌర్ణమి వేడుకలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూ జలు చేశారు. గుండాల మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయ పూజల్లో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు ఈరసరపు యాదగిరి, యూత కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు గూడ మధుసూదనగౌడ్‌, నాయకులు పొడిశెట్టి వెంకన్న, రామచంద్రయ్య, భాస్కర్‌, యాదగిరి పాల్గొన్నారు. వలిగొండ మండలంలోని పలు ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలతో దేవతామూర్తులను భక్తులు పూ జించారు. వలిగొండ పట్టణంలో హరిహర త్రిశక్తి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల, శ్రీదేవీ, భూదేవీ సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలంలోని సాయిబా బా ఆలయంలో క్షీరాభిషకంతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. పోచంపల్లి మండల పరిధిలోని దేశముఖి గ్రామశివారులోని సాయిబృందావనం క్షేత్ర ంలో విశ్వశాంతి సాయిసేవా, ప్రచార్‌ సమాజ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఫౌండ ర్‌ చైర్మన ఘంటా నారాయణస్వామి ఆధ్వర్యంలో దైవయజ్ఞం నిర్వహించారు. భువనగిరి, ఆలేరు, రాజాపేట మండలాల్లో ప్రత్యేక పూజలు చేశారు.