Abn logo
Jun 13 2021 @ 00:10AM

అనుడా చైర్మనగా గురుమోహన ప్రమాణ స్వీకారం

అనుడా చైౖర్మనగా ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతున్న శింగసాని గురుమోహన

కడప, జూన 12 (ఆంధ్రజ్యోతి): అన్నమయ్య పట్టణ అభివృద్ధి సంస్థ (అనుడా) చైర్మన ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. కడప నగర శివార్లలోని మాధవి కన్వెన్షన హాలులో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీ, డిప్యూటీ సీఎం సమక్షంలో శింగసాని గురుమోహన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ అనుడా పరిధిలో కడప కార్పొరేషనతో పాటు 8 మున్సిపాలిటీలు, 31 మండలాలు ఉన్నాయన్నారు. ఈ సంస్థ పరిధిలో అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరుకు తమ వంతు సాయం అందిస్తామన్నారు. ఎంపీ అవినా్‌షరెడ్డి మాట్లాడుతూ శింగసాని గురుమోహన కుటుంబానికి వైఎస్‌ కుటుంబంతో ఎన్నో సంవత్సరాలుగా సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. వైసీపీ అధికారం కోసం పదేళ్లు కష్టపడ్డామని, కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. మేయరు సురే్‌షబాబు మాట్లాడుతూ గురుమోహన అంచెలంచెలుగా ఎదుగుతూ అన్నమయ్య పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన పదవి పొందారన్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి మాట్లాడుతూ అనుడా సంస్థ అభివృద్ధికి కృషిచేసి మంచి పేరు తేవాలన్నారు. అనుడా చైర్మన గురుమోహ న మాట్లాడుతూ ఓర్పుతో పార్టీలో క్రమశిక్షణ కలిగి ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయనడానికి తానే ఉదాహరణ అన్నారు. సీఎం జగన, ఎంపీ అవినా్‌షరెడ్డి జిల్లా నాయకుల సహకారంతో అనుడాను అభివృద్ధి చేస్తామన్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, బద్వేలు మున్సిపల్‌ చైర్మన రాజగోపాల్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైౖర్మన రమణారెడ్డి, ఆదిత్యనాధరెడ్డి, కమిషనరు లవన్న, అనుడా సెక్రటరీ శ్రీల క్ష్మి తదితరులు పాల్గొన్నారు.