కష్టాల్లో గురుకులం

ABN , First Publish Date - 2020-10-23T11:41:03+05:30 IST

మండల కేంద్రమైన మైలవరంలోని ఆంధ్రప్రదేశ్‌ బాలికల గురుకుల పాఠశాల కష్టాల నడుమ కొట్టుమిట్టాడు తోంది.

కష్టాల్లో గురుకులం

పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తున్న పాఠశాల, హాస్టల్‌ భవనాలు 

భయం భయంగా ఉంటున్న విద్యార్థినులు


మైలవరం, అక్టోబరు 22 : మండల కేంద్రమైన మైలవరంలోని ఆంధ్రప్రదేశ్‌  బాలికల గురుకుల పాఠశాల కష్టాల నడుమ కొట్టుమిట్టాడు తోంది. లక్షలు వెచ్చించి భవనాలు నిర్మించినా వాటి చుట్టూ పిచ్చిమొక్కలు మొలచి అడవిని తలపిస్తుండడంతో విద్యార్థినులు భయంగా భయంగా ఉండాల్సి వస్తోంది. దూర ప్రాంతాల నుంచి మంచి విద్యనభ్యసించాలని వచ్చిన విద్యార్థినులు ఇలా పిచ్చి మొక్కల మధ్య అటవీ ప్రాంతంలో ఉన్నట్లు పరిస్థితి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాలికల గురుకుల పాఠశాలలో 420 మంది విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రతి ఏడాది 10వ తరగతి విద్యార్థులు 100 శాతం ఉతీర్ణత సాధిస్తూ జిల్లాలోనే పాఠశాలకు మంచి గుర్తింపు తెస్తున్నారు. పిల్లలను ఇక్కడ చేర్పించేందుకు సీటు కోసం తల్లిదండ్రులు పోటీ పడుతుంటారు.


ఉపాధ్యాయులు బాగా బోధిస్తుండటంతో పాటు మంచి క్రమశిక్షణ ఉండటం గురుకుల పాఠశాల ప్రత్యేకత. అయితే బాలికలు ఉండే వసతి గృహం చుట్టూ పిచ్చిమొక్కలు, కంపచెట్లు విపరీతంగా పెరగడంతో పాములు, తేళ్లు, విషపురుగులు  తిరుగుతూ ఆ ప్రాంతమంతా అధ్వాన్నంగా ఉంటోందని బాలికలు వాపోతున్నారు. వసతి గృహం నుంచి  పాఠశాలలోకి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు భయం భయంగానే వెళ్లాల్సిన దుస్ధితి ఏర్పడిందని బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దాదాపు 35 సం,, కాలం నాటి డార్మిటరీ భవనాలు నిరుపయోగంగా శిఽథిలావస్ధలో ఉండడంతో బాగా చెట్లు పెరిగి అడవిని తలపిస్తూ విషపురుగులకు ఆవాసంగా మారింది.   గత ప్రభుత్వంలో నిర్మించిన మరుగుదొడ్లు మధ్యలోనే అగిపోగా నాడు-నేడు ద్వారా మరో చోట మరుగదొడ్లు లక్షలు వెచ్చించి నిర్మించినా అవి వాడకపోవడంతో కంపచెట్లు పెరిగి నిరుపయోగంగా మారాయి.  ఇప్పటికైనా స్ధానిక ఎమ్మెల్యే, ఎంపీలు చొరవ తీసుకుని వసతి గృహం సముదాయం వద్ద పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


బాలికల వసతి గృహం ఆవరణం అధ్వాన్నంగా ఉంది - ప్రసాద్‌ రెడ్డి, పేరెంట్స్‌ కమిటీ సభ్యుడు,  వీరపునాయినిపల్లి

గురుకుల పాఠశాలలో మా పాప వసతి గృహంలో ఉండి చదువుకుంటోంది. వసతి గృహం వద్దకు వెళ్లాలంటే నాకే భయమేస్తుంది.  వసతి గృహం  ఆవరణమంతా అధ్వాన్నంగా ఉండటంతో విషపురుగులకు నిలయంగా మారింది. రక్షణ గోడలు పడిపోయాయి. అఽధికారులకు పేరెంట్స్‌ కమిటీ పిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు. 



ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం- సరస్వతి, పిన్సిపాల్‌ గురుకుల పాఠశాల, మైలవరం

పాఠశాలలో ప్రహారి పడిపోయాయని, అలాగే పలు పనులు చేయాలని నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాం.  పాఠశాల ప్రహారీ పడిపోయిన చోట గోడలు నిర్మించుకునేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు రోజుల్లో పనులు మొదలు పెడతాం. పిచ్చిమొక్కలు, కంపచెట్లు తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2020-10-23T11:41:03+05:30 IST