గురుకుల విద్యార్థుల‌ అరిగోస సీఎం కేసీఆర్‌కు పట్టదా: విజయశాంతి

ABN , First Publish Date - 2022-04-23T03:25:16+05:30 IST

గురుకుల విద్యార్థుల‌ అరిగోస సీఎం కేసీఆర్‌కు పట్టదా: విజయశాంతి

గురుకుల విద్యార్థుల‌ అరిగోస సీఎం కేసీఆర్‌కు పట్టదా: విజయశాంతి

హైదరాబాద్: ప్రభుత్వ గురుకుల విద్యార్థుల సమస్యల గురించి సీఎం కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. ముఖ్య‌మంత్రి మ‌నవ‌డు తినే భోజ‌నాన్నే గురుకుల విద్యార్థుల‌కు పెడుతున్నమ‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మొద‌ట్లో గొప్ప‌ల‌కు పోయిందని, ఇదే పురుగుల అన్నం ముఖ్య‌మంత్రి మ‌నవ‌డు తింటున్నాడా? అని విద్యార్థుల త‌ల్లీదండ్రులు నిల‌దీస్తున్నారని విజయశాంతి అన్నారు. పేద విద్యార్థుల‌ను అరిగోస పెడుతున్న ఈ ప్ర‌భుత్వాన్ని రానున్న ఎన్నిక‌ల్లో గ‌ద్దెదించి తీరుతామ‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. రాములమ్మ సోషల్ మీడియా పోస్టు యథాతథంగా...



''రాష్ట్రంలో ప్రభుత్వ గురుకులాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పిల్లలు నానా తిప్పలు పడుతున్నరు. ఐదేండ్లుగా మెస్​ చార్జీలు పెంచకపోవడంతో వారికి క్వాలిటీ ఫుడ్‌ అందడం లేదు. గురుకులాల సంఖ్యను పెంచినా... పర్మినెంట్​ బిల్డింగ్స్​ లేక... కిరాయి బిల్డింగ్స్​లోనే కొనసాగిస్తున్నరు. ఇరుకిరుకు గదుల్లో పిల్లలను కుక్కుతున్నరు. ఎక్కడా కూడా సరిపోయేటన్ని టాయిలెట్లు, మరుగుదొడ్లు లేవు. సురక్షిత తాగునీరు కూడా అందడం లేదు. తినే తిండి కలుషితమై పిల్లలు అస్వస్థతకు గురవుతున్నా... కారణాలపై ఆరా తీసేవారే క‌రువ‌య్యారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 298  రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. కొత్తగా 608 రెసిడెన్షియల్ స్కూళ్లు, 53 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ప్రస్తుతం గురుకులాల సంఖ్య 959కి చేరింది. వీటిల్లో సుమారు 2.5 లక్షల మంది చదువుతున్నారు. ఈ గురుకులాలు రోజుకో సమస్యతో వార్తల్లోకి ఎక్కుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు సెక్రటరీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న రొనాల్డ్ రాస్ ఆర్థికశాఖకే పరిమితమై గురుకులాలపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నరనే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నయి. గురుకులాల్లో మంచి ఫుడ్‌‌‌‌ లేదు. వారానికి ఆరుసార్లు గుడ్లు పెట్టాల్సి ఉండగా... మూడు, నాలుగు సార్లు కూడా పెడ్తలేరు. ఉదయం ఇడ్లి, పూరి, బోండా వంటి టిఫిన్లు పెట్టాల్సి ఉండగా... కిచిడీ, సాంబారుతో కానిచ్చేస్తున్నారు. నెలకు రెండు సార్లు పెట్టాల్సిన మటన్​ను బంద్​ పెట్టి, నాలుగు సార్లు చికెన్​ పెడుతున్నరు. కూరలు మొత్తం నీళ్లు నీళ్లుగా, చారు లెక్క చేస్తున్నరని, ఉడికీ ఉడకని అన్నం... అరకొర భోజనంతో నెట్టుకొస్తున్నరని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. పండ్లను అసలే ఇస్తలేరు. క్వాలిటీ, క్వాంటిటీ ఫుడ్‌‌‌‌ పెట్టడం లేదు. అన్నంలో పురుగులు వస్తున్నయని స్టూడెంట్లు ఆందోళనకు దిగినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. మార్చి 15న మహబూబాబాద్‌‌‌‌ జిల్లా సీరోలులో ఏకలవ్య ఆదర్శ గురుకుల బాలికల స్కూల్‌‌‌‌లో దాదాపు 38మంది స్టూడెంట్లు కలుషిత ఆహారం తిని వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. మార్చి 16న గద్వాల జిల్లా అలంపూర్ తాలూక ఇటిక్యాల గురుకులంలో పురుగులు ఉన్న భోజనం పెడుతున్నారని ఎంఈవోకు స్టూడెంట్లు ఫిర్యాదు చేశారు. ఇంతా జ‌రుగుతున్నా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేదు. పేద విద్యార్థులు అనారోగ్యం పాలై చ‌దువులు మానేస్తున్నరు. ముఖ్య‌మంత్రి మ‌నవ‌డు తినే భోజ‌నాన్నే గురుకుల విద్యార్థుల‌కు పెడుతున్నమ‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం మొద‌ట్లో గొప్ప‌ల‌కు పోయింది. ఇదే పురుగుల అన్నం ముఖ్య‌మంత్రి మ‌నవ‌డు తింటున్నాడా? అని విద్యార్థుల త‌ల్లీదండ్రులు నిల‌దీస్తున్నారు. పేద విద్యార్థుల‌ను అరిగోస పెడుతున్న ఈ ప్ర‌భుత్వాన్ని రానున్న ఎన్నిక‌ల్లో గ‌ద్దెదించి తిరుతామ‌ని ప్ర‌జ‌లు ఆగ్ర‌హాం వ్య‌క్తం చేస్తున్నారు.'' అని విజయశాంతి అన్నారు.



Updated Date - 2022-04-23T03:25:16+05:30 IST