గుర్‌గ్రామ్‌ టు దర్భంగా 1200 కి.మీ. సైక్లింగ్‌

ABN , First Publish Date - 2020-05-22T10:15:25+05:30 IST

బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఉపాధి నిమిత్తం ఆమె కుటుంబం గుర్‌గ్రామ్‌ చేరింది. తండ్రి మోహన్‌ పాసవాన్‌ ఆటోరిక్షా నడిపేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో

గుర్‌గ్రామ్‌ టు దర్భంగా 1200 కి.మీ. సైక్లింగ్‌

  • 15 ఏళ్ల బాలిక సాహసం
  • ట్రయల్స్‌కు పిలిచిన సమాఖ్య


న్యూఢిల్లీ: బిహార్‌లోని దర్భాంగాకు చెందిన 15 ఏళ్ల జ్యోతి కుమారి ఎనిమిదో తరగతి విద్యార్థిని. ఉపాధి నిమిత్తం ఆమె కుటుంబం గుర్‌గ్రామ్‌ చేరింది. తండ్రి మోహన్‌ పాసవాన్‌ ఆటోరిక్షా నడిపేవాడు. అయితే కరోనా లాక్‌డౌన్‌తో పనిలేకపోవడంతో ఆటోరిక్షా యజమాని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.. అంతకుముందే ప్రమాదంలో పాసవాన్‌ గాయపడడంతో లాక్‌డౌన్‌లో మరేదన్నా పని కూడా చేయలేకపోయాడు. దాంతో ఇంటి అద్దె కట్టలేని దుస్థితి. ఫలితంగా ఇంటి యజమాని ఖాళీ చేయాలని హుకుం జారీ చేయకముందే స్వస్థలానికి వెళ్లిపోవాలనుకుంది జ్యోతి. ఓ ట్రక్‌ డ్రైవర్‌ను అడిగితే దర్భాంగా వెళ్లేందుకు రూ. 6,500 అడిగాడు. కానీ వారి చేతిలో ఉన్న మొత్తమే రూ. 600. ఇకలాభంలేదని రూ. 500 పెట్టి ఓ పాత సైకిల్‌ కొని తండ్రిని వెనక కూ ర్చోబెట్టుకొని ఈనెల 10న జ్యోతి తన ప్రయాణం ప్రా రంభించింది. రోజుకు 100-150కి.మీ చొప్పున రాత్రనక పగలనక సైకిల్‌ తొక్కింది. ఎట్టకేలకు 1200 కి.మీ., దూరంలోని స్వస్థలానికి ఈనెల 18న చేరింది. ‘రాత్రుళ్లు సైకిల్‌ తొక్కినందుకు నేను భయపడలేదు. కానీ వాహనాలు వెనకనుంచి ఎక్కడ ఢీకొంటాయోనని ఆందోళన చెందా. అదృష్టవశా త్తు అలాంటి పరిస్థితులు ఎదురుకాలేదు’ అని జ్యోతి చెప్పింది. ఆమె చేసిన సాహసం సోషల్‌మీడియాలో వైరల్‌ అయింది. నెటిజన్లు ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్‌ చెప్పారు.


సైక్లింగ్‌ సమాఖ్య ఆహ్వానం

అంతదూరం, అందునా వెనుక మరొకరు..విపత్కర పరిస్థితుల మధ్య జ్యోతి చూపిన పట్టుదలకు, తెగువకు, ఆమె శక్తి సామర్థ్యాలకు అచ్చెరువొందిన భారత సైక్లింగ్‌ సమాఖ్య (సీఎ్‌ఫఐ) ఆమెతో గురువారంనాడు మాట్లాడి ట్రయల్స్‌కు ఢిల్లీ రావాలని కోరింది. జ్యోతి..ట్రయల్స్‌లో సత్తాచాటితే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలోగల జాతీయ సైక్లింగ్‌ అకాడమీలో శిక్షణ ఇస్తామని సమాఖ్య చైర్మన్‌ ఓంకార్‌ సింగ్‌ తెలిపారు.

Updated Date - 2020-05-22T10:15:25+05:30 IST