work from home: భారీవర్షాల నేపథ్యంలో సంచలన ఆదేశాలు

ABN , First Publish Date - 2022-09-23T15:15:41+05:30 IST

భారీవర్షాలు(heavy rain) కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం గురుగ్రామ్ జిల్లా అధికార యంత్రాంగం సంచలన ఆదేశాలు జారీ చేసింది...

work from home: భారీవర్షాల నేపథ్యంలో సంచలన ఆదేశాలు

గురుగ్రామ్: భారీవర్షాలు(heavy rain) కురుస్తున్న నేపథ్యంలో శుక్రవారం గురుగ్రామ్ జిల్లా అధికార యంత్రాంగం సంచలన ఆదేశాలు జారీ చేసింది. భారీవర్షాలు, వరదల వల్ల శుక్రవారం గురుగ్రామ్ నగరంలోని కార్పొరేట్, ప్రైవేటు సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోం చేసేలా(work from home) చూడాలని పాలనాయంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అతి భారీవర్షాల వల్ల రోడ్లపై వరదనీరు పారుతున్న నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం అమలు చేయాలని జిల్లా డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ(District Disaster Management Authority) సలహా(advisory) ఇచ్చింది.



ట్రాఫిక్ అవస్థలున్నందున కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులందరికీ ఇంటి నుంచి పనిచేసేలా చూడాలని జిల్లా అధికారులు ఆదేశించారు. నగరంలోని స్కూళ్లు, కళాశాలలకు శుక్రవారం సర్కారు సెలవు ప్రకటించింది.(close schools and colleges) వరదనీరు రోడ్లపై పారుతున్నందున వాహనచోదకులు జాగ్రత్తలు తీసుకోవాలని గురుగ్రామ్ ట్రాఫిక్ పోలీసులు సలహా ఇచ్చారు. రోడ్లపై వరదనీరు ప్రవహిస్తున్నందున 1000 మంది పోలీసులను మోహరించామని ట్రాఫిక్ పోలీసు అధికారి చెప్పారు. 

Updated Date - 2022-09-23T15:15:41+05:30 IST