అనంతుడి సేవలో గురుప్రకాశ్‌

ABN , First Publish Date - 2022-07-03T05:27:30+05:30 IST

అనంతుడి సేవలో గురుప్రకాశ్‌

అనంతుడి సేవలో గురుప్రకాశ్‌
పద్మనాభుడిని దర్శించుకున్న గురుప్రకాశ్‌


వికారాబాద్‌, జూలై2: వికారాబాద్‌ పర్యటనలో భాగంగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గురుప్రకాశ్‌ శనివారం ఉదయం అనంతగిరిలోని శ్రీఅనంతపద్మనాభ స్వామిని మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం వికారాబాద్‌ మండల పరిధిలోని గొట్టిముక్ల గ్రామంలో కిసాన్‌మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి నివాసంలో భోజనం చేసి హైదరాబాద్‌ వెళ్లారు. ఆయన వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-07-03T05:27:30+05:30 IST