ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2020-07-06T11:33:30+05:30 IST

గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నారాయణపేట/ధన్వాడ/ మక్తల్‌ టౌన్‌/ మక్తల్‌ రూరల్‌/ కోస్గి, జూలై 5 : గురు పౌర్ణమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ ఆలయం, షిర్డీ సాయి, అమృత సాయి, వ్యాసాశ్రమంలో ప్రత్యేక పూజలు జరిగాయి. సద్గురు అవధూత నరసింహస్వామి మఠంలో గురు పౌర్ణమి వేడుకలను నిర్వాహకులు భౌతిక దూరం పాటిస్తూ భక్తిశ్రద్ధలతో స్వామి వారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం మహా మంగళహారతి చేపట్టి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మఠం కమిటి అధ్యక్షుడు దేవదత్త ఢగే, కౌన్సిలర్లు బండి రాజేశ్వరి శివరాంరెడ్డి, జొన్నల అనిత సుభాష్‌, శ్రీనివాస్‌, భక్తులు పాల్గొన్నారు. అమృత సాయి మందిరంలో సరాఫ్‌ కుటుంబ సభ్యులు సాయి బాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో గురు గాయత్రి మహాయజ్ఞం నిర్వహించారు.


కార్యక్రమంలో యోగా సమితి జిల్లా అధ్యక్షుడు సురేష్‌ కుమార్‌, రాజు లాహోఠి, శివకుమార్‌, యశ్వంత్‌, మల్లు, రాజు, బల్వీర్‌, ఆనంద్‌, రామ్‌నాథ్‌ పాల్గొన్నారు. ధన్వాడ మండలంలో భక్తులు గురు పౌర్ణ మి వేడుకలను జరుపుకున్నారు. మక్తల్‌ పట్టణం లోని శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయంలో వీహెచ్‌పీ, భజరంగదళ్‌ ఆధ్వర్యంలో గురుపౌర్ణమి, వేద వ్యాస మహర్షి జయంతి వేడుకలను ఘనం గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ ఉమ్మడి జిల్లా సహాయ కార్యరద్శి భీంరెడ్డి, ఆలయ అర్చకులు ప్రాణేష్‌చారి, విశ్వహిందూ పరిషత్‌ నా యకులు పాల్గొన్నారు. మక్తల్‌ మండలం వల్లభా పురంలోని శ్రీదత్తపీఠం, శ్రీపాదచాయ ఆశ్రమం, మంథన్‌గోడ్‌లోని దత్తక్షేత్రంలో గురుపౌర్ణమి వేడు కలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పీవనజ, సర్పంచ్‌లు దత్తు, మహాదేవమ్మ, కల్పన క్రిష్ణ, జానకీలక్ష్మణ్‌, మహేశ్వరమ్మ, ఎంపీటీసీలు చిన్నరంగప్ప, గున్నసుమిత్ర, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. కోస్గిలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు హనుమంతు, వేణుగోపాల్‌ మ్యాకల నర్సిములు, చల్లా వెంకటేశం తెలిపారు. 

Updated Date - 2020-07-06T11:33:30+05:30 IST