తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువా ఎనలేని కృషి

ABN , First Publish Date - 2022-09-29T05:10:26+05:30 IST

కవికోకిల, కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి బిరు దాంకితులు గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా రాజంపేట జూనియర్‌ కళాశాలలో తెలుగు భాష సంరక్షణ సమితి మండల శాఖ అధ్వర్యంలో ప్రధానాచార్యులు రామిరెడ్డి అధ్య క్షతన వేడుకలు నిర్వహించారు.

తెలుగు సాహిత్యానికి గుర్రం జాషువా ఎనలేని కృషి
రాజంపేట: నివాళులర్పిస్తున్న తెలుగు భాష సంరక్షణ సమితి సభ్యులు

రాజంపేట, సెప్టెంబరు 28: కవికోకిల, కవితా విశారద నవయుగ కవి చక్రవర్తి బిరు దాంకితులు గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా రాజంపేట జూనియర్‌ కళాశాలలో  తెలుగు భాష సంరక్షణ సమితి మండల శాఖ అధ్వర్యంలో  ప్రధానాచార్యులు రామిరెడ్డి అధ్య క్షతన వేడుకలు నిర్వహించారు. గుర్రం జాషు వా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు. ఈ సందర్భంగా సమితి జిల్లా కార్యదర్శి కాకర్ల రాముడు, సహాయ కార్య దర్శి గంగనపల్లి వెంకటరమణ, తెలుగు విశ్రాంత పండితులు నారాయణరాజు, తెలుగు ఉపన్యాస కులు నీరజలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ  పరభాష వ్యామోహంలో పడి మాతృభాషను మర్చిపోకూడదన్నారు. తెలుగు భాష అభ్యున్నతికి గుర్రం జాషువా చేసిన కృషి చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు. ఉపన్యాస కులు చంద్రమోహన్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ మురళీ కృష్ణరెడ్డి, రవిచంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

రైల్వేకోడూరు(రూరల్‌): గుర్రం జాషువా 127వ జయంతి సందర్భంగా రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌. యం.శ్రీలత ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పిం చారు. గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాల వేసి, అంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ గుర్రం జాషువా తెలుగు సాహిత్యం కోసం ఎనలేని కృషి చేశారని కొని యాడారు. సమాజంలో అసమానతలను రూపు మాపుటలో ఆయన కృషి అభినందనీయం అ న్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకు లు దాసరి మోషే, ఈ. ప్రేమలత, జే.పెంచల య్య, డాక్టర్‌.శ్రీనివాసులు, డాక్టర్‌. సుబ్రహ్మణ్యం రాజు, వెంకటేశ్వర్లు, జి. శివయ్య, ఉమా మహే శ్వరి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:10:26+05:30 IST