గురువయ్య వైపే అధిష్ఠానం!

ABN , First Publish Date - 2021-03-07T06:10:44+05:30 IST

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సోమవారం లేదా శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న సమాచారంతో అభ్యర్థి ఖరారు విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది.

గురువయ్య వైపే అధిష్ఠానం!

నోటిఫికేషన్‌ రోజే సాగర్‌ అభ్యర్థిని ప్రకటించనున్న టీఆర్‌ఎస్‌

నల్లగొండ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సోమవారం లేదా శుక్రవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడుతుందన్న సమాచారంతో అభ్యర్థి ఖరారు విషయాన్ని ఓ కొలిక్కి తెచ్చినట్లు తెలిసింది. టికెట్‌ను యాదవ సామాజికవర్గానికే ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. స్థానికేతరుడు, పార్టీ క్యాడర్‌ సిద్ధంగా లేద న్న కారణంతో భగత్‌ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఇప్పటికే పక్కన పెట్టిందని తెలిసింది. ఆ తరువా తే పెద్దబోయిన శ్రీనివాస్‌, కట్టెబోయిన గురువయ్య, రంజిత్‌ యాదవ్‌తో సీఎం నేరుగా మా ట్లాడారు. వివిధ మార్గాల్లో సర్వే నివేదికలు తెప్పించుకున్న సీఎం కేసీఆర్‌, గురువయ్య యాదవ్‌వైపే మొగ్గుచూపి, జిల్లా కీలకనేతలకు ఆ విషయాన్ని స్పష్టం చేసినట్టు సమాచా రం. సాగర్‌ మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తియాదవ్‌ కుమార్తెను గురువయ్య వివాహం చేసుకో గా, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, ఏపీ మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావుకు బంధువు. ఆర్థిక, సామాజిక, స్థానికత, కుటుంబ నేపథ్యం తదితర అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని గురువయ్య వైపు గులాబీ బాస్‌ మొగ్గుచూపినట్టు సమాచారం. ఉపఎన్నికకు నోటిఫికేషన్‌ వెలువడగానే అభ్యర్థిని ప్రకటించాలని టీఆర్‌ఎస్‌ యోచిస్తోంది. 

Updated Date - 2021-03-07T06:10:44+05:30 IST