Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతు ఆత్మహత్యకు పోలీసులకు సంబంధం లేదు: ఎస్పీ అరిఫ్

గుంటూరు: మేడికొండూరు మండలం పాలడుగులో పోలీసుల వేధింపులతో రైతు ఆనందరావు ఆత్మహత్య చేసుకున్నాడన్న ఆరోపణల్లో వాస్తవం లేదని జిల్లా అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు.కొంతమంది కావాలనే పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పాలడుగు గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి చాలామందిని  ప్రశ్నించామన్నారు. గ్యాంగ్ రేప్ కేసులో ఆధారాల కోసం కొంతమందిని పిలిచామన్నారు. ఆనందరావు ఆత్మహత్య కేసులో పోలీసుల వేధింపులు లేవని ఎస్పీ అరిఫ్ హాఫీజ్ తెలిపారు.  జిల్లాలోని మేడికోండూరు మండలం  పాలడుగులో దారుణం జరిగింది. పోలీసుల వేధింపులను భరించలేక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పాలడుగు గ్యాంగ్ రేప్ కేసులో విచారణ పేరుతో రైతును పోలీసులు వేధించారు. దీంతో పోలీసుల  వేధింపులను భరించలేక అనందరావు(43) పురుగుల మందు తాగాడు. తాను కౌలుకు తీసుకున్న పొలంలోనే ఆనంద రావు పురుగుల మందును తాగాడు. తన భర్త చావుకు పోలీసులే కారణమని అనందరావు భార్య ఆరోపించింది. నెల రోజులైనా పాలడుగు గ్యాంగ్ రేప్ కేసులో పురోగతి జరుగడం లేదు. సెప్టెంబరు నెలలో జిల్లాలోని మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో దంపతులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను అడ్డగించారు. భర్తను చెట్టుకు కట్టేసి అతని కళ్లెదుటే భార్యపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. సత్తెనపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు మేడికొండూరు మండలం పాలడుగులోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. రాత్రి  అక్కడి నుంచి తిరిగి వస్తుండగా గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద నలుగురు దుండగులు అడ్డుకున్నారు. భర్తపై దాడి చేసి భార్యని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. సుమారు మూడు గంటలపాటు ఆమెకి నరకం చూపించారు. భార్యాభర్తలు ఒంటి గంట సమయంలో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. పొలాల్లోకి లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాలడుగు అడ్డరోడ్డు ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌స్టోరేజీలో పని చేసున్న 70 మంది కార్మికులను ఇప్పటికే విచారించారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement