నరసరావుపేట జైల్లో టీఎన్ఎస్ఎఫ్ దీక్ష

ABN , First Publish Date - 2021-01-26T14:53:54+05:30 IST

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టీఎన్ఎస్ఎఫ్ ఒక్క రోజు దీక్షకు పూనుకుంది.

నరసరావుపేట జైల్లో టీఎన్ఎస్ఎఫ్ దీక్ష

గుంటూరు: విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలంటూ టీఎన్ఎస్ఎఫ్ ఒక్క రోజు దీక్షకు పూనుకుంది. జీఓ 77, రాష్ట్రంలో జరుగుతున్న రాజ్యాంగ వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా అరెస్టు అయిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు ప్రణవ్  గోపాల్, వంశీకృష్ణ, శరత్, సాయి, సుప్రవాత్ నరసరావుపేట జైలులో ఒక రోజు నిరాహార దీక్షకు దిగారు. వీరికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, అనుబంధ విభాగాలు ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. గణతంత్ర దినోత్సవం రోజు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారత దేశానికి రాజ్యాంగం అమలులోకి తీసుకుని వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అన్ని విధాల సముచిత గౌరవం కల్పించారని... కాని జగన్ గెలిచిన తరువాత రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపించారు. దాని వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు అన్ని విధాల నష్టపోతున్నాయని తెలిపారు. విద్యార్థులకు న్యాయం చెయ్యమంటే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. జీవో 77 వల్ల 1.5 లక్షల వచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  విద్యార్ధులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారన్నారు. దీనిని ప్రశ్నించిన టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులను అరెస్టు చేశారని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా త్వరలోనే టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-01-26T14:53:54+05:30 IST