గుంటూరు : తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-07-14T15:34:05+05:30 IST

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.

గుంటూరు : తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

గుంటూరు : జిల్లాలోని తెనాలిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ఒక్కరోజే 97 కేసుల నమోదవ్వడంతో తెనాలివాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం తెనాలి నియోజకవర్గంలో కరోనా కేసులు ట్రిపుల్ సెంచరీ దాటాయి. కొత్తగా నమోదైన కేసులతో కలిపితే నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య  304కు చేరుకుంది. తెనాలిలోని ఒక ప్రాంతంలోనే భారీగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల పెద్ద ఎత్తున పరీక్షలు చేయడంతో కేసుల సంఖ్య కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. గంగానమ్మపేట, సాలిపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అధికారులు పరీక్షలు చేశారు. దాదాపు ఆయా ప్రాంతాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-14T15:34:05+05:30 IST