Gunturలో టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు

ABN , First Publish Date - 2021-09-09T13:29:28+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

Gunturలో టీడీపీ నేతల ముందస్తు అరెస్ట్‌లు

గుంటూరు: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. నరసరావుపేటలో 144 సెక్షన్‌ అమల్లో ఉందని జిల్లా పోలీసులు చెబుతున్నారు. అటు లోకేష్ పర్యటన దృష్ట్యా టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. సత్తెనపల్లిలో టీడీపీ నేత కోడెల శివరాంను ముందస్తుగా అరెస్ట్ చేశారు. టీడీపీ నేత అరవిందబాబును గృహనిర్బంధం చేశారు. చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి హౌస్‌ అరెస్ట్‌ చేశారు. నక్కా ఆనందబాబు, కార్పొరేటర్లు దేవినేని అపర్ణ, ఉషారాణిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

మరోవైపు ఈరోజు నరసరావుపేటలో పర్యటించనున్న లోకేష్ గొళ్లపాడులో ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించనున్నారు. కాగా లోకేష్ నరసరావుపేట పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

Updated Date - 2021-09-09T13:29:28+05:30 IST