గుంటూరు/Guntur: తాడికొండ (Tadikonda)లో అధికార పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి (Mla Undavalli Sridevi)కి వ్యతిరేకంగా మరో వర్గం సమావేశం కావడం కలకలం రేపింది. ఎమ్మెల్యే శ్రీదేవి ఒంటెద్దు పోకడలు పోతున్నారని.. ఏక పక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని.. సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తాడికొండలో నిర్వహించే గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం గురించి కనీసం జడ్పీటీసీ (Zptc), ఎంపీటీసీ (Mptc), సర్పంచ్ (Surpunch)లకు సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడుతున్నారు. గతంలో ఎమ్మెల్యే తీరుకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా తమ సమస్యలు పరిష్కారంకాలేదన్నారు. దాంతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తాడికొండ మండలంలో గడపగడపకు కార్యక్రమాన్ని చేపడతామన్నారు.
ఇవి కూడా చదవండి