Guntur: కుమారుడితో కలిసి రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-04-28T14:17:43+05:30 IST

జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో కుమారుడితో కలిసి రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.

Guntur: కుమారుడితో కలిసి రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నం

గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో కుమారుడితో కలిసి రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రేషన్ డీలర్ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి రూ.25 లక్షలు తీసుకొని మోసం చేశాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం బాధితులు పోలీసులకు ‌ఫిర్యాదు చేశారు. చివరకు మనస్తాపంతో గత రాత్రి తండ్రీకొడుకులు బలవన్మరణానికి యత్నించారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-04-28T14:17:43+05:30 IST