Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేడికొండూరు ఘటనపై పోలీసులు సకాలంలోనే స్పందించారు: డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ

గుంటూరు: మేడికొండూరు అత్యాచార ఘటనపై పోలీసులు సకాలంలోనే స్పందించారని గుంటూర్ రేంజ్ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ అన్నారు. అర్థరాత్రి సత్తెనపల్లి పీఎస్‌కు బాధితులు వస్తే వివరాలు తీసుకొని మేడికొండూరు పోలీసులకు అప్పగించారని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారన్నారు.  పోలీసులు రాత్రి వేళ నిందితుల కోసం గాలింపు చేపట్టారన్నారు. పోలీసుల పనితీరుపై దుష్ప్రచారం సరికాదని రేంజ్ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ అన్నారు. 

 


జిల్లాలో బుధవారం రాత్రి మేడికొండూరు మండలం పాలడుగు రోడ్డులో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసిదే. భర్తను కొట్టి, కట్టేసి ఆయన కళ్లెదుటే భార్యపై నలుగురు మృగాళ్లు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడ్డారు. 

 సత్తెనపల్లికి చెందిన దంపతులు మేడికొండూరు మండలం పాలడుగు గ్రామంలో బుధవారం ఓ శుభ కార్యానికి హాజరై తిరిగి రాత్రి పది గంటల ప్రాంతంలో స్వ గ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వారు గ్రామం నుంచి ప్రధాన రహదారికి చేరుకునే క్రమంలో పాలడుగురోడ్డులో నలుగురు దుండగులు  దాడి చేశారు. మహిళను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ఆమె భర్త ఎదురు తిరగడంతో అతడ్ని కొట్టి, కత్తులతో బెదిరించి కట్టేసి నలుగురూ ఒకరి తర్వాత ఒకరు మహిళపై అత్యాచారం చేశారు. బాధితురాలి వద్ద ఉన్న బంగారపు ఉంగరం, చెవిపోగులు, మాటీలు, మంగళసూత్రం, వెండి పట్టీలు, ఆమె వద్ద ఉన్న 3,100 నగదు, భర్త వద్ద ఉన్న 1500 నగదును గుంజుకున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని, కొడవళ్ళతో బెదిరించారు. రాత్రి 12 గంటల తర్వాత వారిని వదలి దుండగులు పరారయ్యారు. అనంతరం దంపతులు సత్తెనపల్లి పోలీసు స్టేషన్‌కు  వెళ్లి జరిగిన ఘోరం గురించి చెప్పారు. అయితే సంఘటన జరిగిన ప్రాంతం తమ పరిధిలోకి రాదని, మేడికొండూరు పోలీసు స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగంలోకి దిగిన మేడికొండూరు పోలీసులు దంపతుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. బాధిత దంపతులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. విషయం తెలుసుకున్న సత్తెనపల్లి, సౌత డీఎస్పీలు విజయభాస్కరరెడ్డి, ప్రశాంతి సిబ్బందితో ఘటనా స్థలంతోపాటు, సమీప ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు.


Advertisement
Advertisement