గుంటూరులో పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2020-02-17T01:32:25+05:30 IST

జిల్లాలోని అరండల్ పేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షి ప్రతులను దగ్ధం చేశారని టీడీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పలువురు జిల్లా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ

గుంటూరులో పోలీసుల అత్యుత్సాహం

గుంటూరు: జిల్లాలోని అరండల్ పేటలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సాక్షి ప్రతులను దగ్ధం చేశారని టీడీపీ నేతల పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పలువురు జిల్లా టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై పార్టీ నేతలు, కార్యకర్తలు భగ్గుమన్నారు. పలువురు మహిళలు పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ పోలీసు జీపునకు అడ్డంగా నిలిచారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Updated Date - 2020-02-17T01:32:25+05:30 IST