మేమూ ఓటేశాం.. మాకేవీ స్థలాలు?

ABN , First Publish Date - 2020-07-08T18:17:11+05:30 IST

ఓ వర్గం వారు చెప్పిన వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారు.. అందులో..

మేమూ ఓటేశాం.. మాకేవీ స్థలాలు?

తహసీల్దారు కార్యాలయం వద్ద వైసీపీ నేతల ఆందోళన

ఓ వర్గానికి కొమ్ముకాస్తున్నారంటూ అధికారులపై ధ్వజం


పెదనందిపాడు(గుంటూరు): ఓ వర్గం వారు చెప్పిన వారికే ఇళ్ల స్థలాలు కేటాయించారు.. అందులో అనర్హులు చాలామంది ఉన్నారు.. మేమూ వైసీపీకి ఓటేశాం.. మాలో అర్హులను కూడా పక్కన పెట్టారు..  అంటూ వైసీపీకి ఓ వర్గం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేసింది. ఇంటి స్థలాల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందంటూ మంగళవారం నాగులపాడు, కట్రపాడు, పుసులూరు, ఉప్పలపాడు, పెదనందిపాడు గ్రామాలకు చెందిన వైసీపీ పార్టీ నాయకులతో గ్రామస్థులు పెద్దఎత్తున తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు.


మట్టి తవ్వకాల విషయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, ఓ వర్గానికి  కొమ్ము కాస్తూ అవినీతిలో పాలు పంచుకుంటున్నారంటూ అధికారులపై ఆరోపణలు చేశారు. అక్కడే మరో వర్గానికి చెందిన మండల పార్టీ నాయకులు అక్కడే ఉండటంతో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలు వాదులాడుకున్నాయి. తమ వర్గానికి అన్యాయం జరిగితే సహించేది లేదంటూ గ్రామస్తులను అధికారులను హెచ్చరించారు.


Updated Date - 2020-07-08T18:17:11+05:30 IST