నగ్న ఫొటోలు తీసి బెదిరింపు

ABN , First Publish Date - 2020-07-07T18:02:46+05:30 IST

ప్రేమపేరుతో మోసం చేయడమే కాక..

నగ్న ఫొటోలు తీసి బెదిరింపు

యువకుడికి ఇద్దరు కానిస్టేబుళ్ల సహకారం

రూరల్ ఎస్పీకి ఇంజనీరింగ్ విద్యార్థిని ఫిర్యాదు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రేమపేరుతో మోసం చేయడమే కాక ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు చూపి డబ్బులు ఇవ్వాలని, లేదంటే వాటిని బయటపెడతానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు నరసరావుపేటకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని సోమవారం రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనతో పాటు చదువుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడ్డాడని ఆమె తెలిపింది. తన నుంచి 2 లక్షల నగదు, రెండు బంగారపు గాజులు తీసుకున్నాడన్నారు. తామిద్దరం ఏకాంతంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను బహిర్గతం చేస్తానని, సోషల్ మీడియాలో పెడతానని ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి అతడు బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - 2020-07-07T18:02:46+05:30 IST