గుంటూరు: టీడీపీ ఇన్‌చార్జ్ అరవింద్ బాబుపై పోలీసుల దాడికి నిరసనగా నరసరావుపేటలో ఆ పార్టీ శ్రేణులు నిరసన ప్రదర్శనకు దిగారు. టీడీపీ ఆఫీస్ నుంచి అరవింద్ బాబు చికిత్స పొందే ఆసుపత్రి వరకు ర్యాలీ చేపట్టారు. నల్ల జెండాలతో నిరసన ర్యాలీకి దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ కార్యకర్తలను విడుదల చేయాలని నినాదాలు చేశారు. అరవింద్ బాబుపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో టీడీపీ నేతలు జవహర్, కొల్లు రవీంద్ర, జి.వి. ఆంజనేయులు, యరపతినేని, శ్రావణ కుమార్, దాసరి రాజా మాస్టార్, నల్లపాటి రాము పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి