గుంటూరు: వివాహితపై వాలంటీర్ దాష్టీకం

ABN , First Publish Date - 2021-10-25T17:19:34+05:30 IST

గుంటూరు: మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామంలో ఓ వివాహితపై వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు.

గుంటూరు: వివాహితపై వాలంటీర్ దాష్టీకం

గుంటూరు: మాచవరం మండలం, పిల్లుట్ల గ్రామంలో ఓ వివాహితపై వాలంటీర్ దాష్టీకం ప్రదర్శించాడు. ఒంటరిగా ఉన్న బాలింతను కామవాంఛ తీర్చాలంటూ వాలంటీర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లోకి ప్రవేశించి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో భయపడిన మహిళ  బయటకు పరుగులు తీసింది. ఎవరికైనా చెబితే ఊళ్ళో తిరగలేవంటూ వాలంటీర్ ఆమెను బెదిరించాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వాలంటీర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-10-25T17:19:34+05:30 IST