రంగులపై ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్‌పై ‌లేదు: Ravipati Sai Krishna

ABN , First Publish Date - 2022-06-08T17:20:06+05:30 IST

వైసీపీ ప్రభుత్వంపై రావిపాటి సాయి కృష్ణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

రంగులపై ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్‌పై ‌లేదు: Ravipati Sai Krishna

Guntur: వైసీపీ (YCP) ప్రభుత్వంపై తెలుగు యువత గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ (Ravipati Sai Krishna) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పదో తరగతి ఫలితాలు వచ్చాయన్నారు. టెన్త్ పరీక్షలు నిర్వహించడం ఫలితాలు విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. నాడు నేడు పేరుతో పాఠశాలలకు రంగులు వేసి కోట్ల రూపాయలు స్వాహా చేశారని, రంగులపై ఉన్న శ్రద్ద విద్యార్థుల భవిష్యత్‌పై లేదని విమర్శించారు.


పాఠశాలలో ఉన్నతమైన విద్యపై శ్రద్ద పెట్టలేదని, 71 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫెయిల్ అవ్వడం సిగ్గుమాలిన చర్యని సాయి కృష్ణ అన్నారు. ‘‘పదో తరగతి విద్యార్థుల ఫెయిల్... ప్రభుత్వ పతనానికి నాంది.. మేనమేమ అని చెప్పుకుంటున్న సీఎం.. విద్యార్థుల పట్ల శాపంగా మారారు.. ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారిని పాస్ చేయాలన్నారు..’’ అప్రకటిత విద్యుత్ కోతలు కూడా విద్యార్థులు ఫెయిల్ అవ్వదానికి ఒక కారణమని సాయి కృష్ణ అన్నారు. 


Updated Date - 2022-06-08T17:20:06+05:30 IST