గుంటూరు: మంగళగిరి మండలం యర్రబాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరువులోకి కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కారు నెంబర్ ఆధారంగా మృతుల వివరాలు సేకరించారు. మృతులు విస్సన్నపేట మండలం పుట్రేల వాసులుగా గుర్తించారు. కారు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. చెరువులో నుంచి కారును స్థానికులు బయటకు తీశారు. మృతులు యువకులుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
ఇవి కూడా చదవండి