ఉడికిన కోస్తా

ABN , First Publish Date - 2022-06-03T03:33:04+05:30 IST

ఎండ తీవ్రతతో గురువారం కోస్తా మండిపోయింది. ఎండకు ఉక్కపోత తోడు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది.

ఉడికిన కోస్తా

విశాఖపట్నం: ఎండ తీవ్రతతో గురువారం కోస్తా మండిపోయింది. ఎండకు ఉక్కపోత తోడు కావడంతో వాతావరణం భరించలేని విధంగా మారింది. ప్రధానంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో పరిస్థితి మరింత దారుణంగా అయింది. ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు పడ్డారు. కోస్తాలోని ఐదు మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 81 మండలాల్లో వడగాడ్పులు వీచినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఉష్ణోగ్రతలు అనేకచోట్ల 44 నుంచి 45 డిగ్రీలు, అక్కడక్కడా 45 నుంచి 46 డిగ్రీల వరకు నమోదయ్యాయని వెల్లడించింది. ఆత్రేయపురంలో 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని వివరించింది. శుక్రవారం 83 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 మండలాల్లో వడగాడ్పులు, శనివారం 68 మండలాల్లో వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించింది. కాగా గన్నవరంలో 44.8 డిగ్రీలు నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 

Updated Date - 2022-06-03T03:33:04+05:30 IST