Advertisement
Advertisement
Abn logo
Advertisement

రేషన్ బియ్యం స్మగ్లర్లపై పీడీ చట్టం

గుంటూరు: జిల్లాలో రేషన్ బియ్యాన్ని అమ్ముతున్న స్మగ్లర్లపై క్రిమినల్, పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని జిల్లా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గత నెల రోజులుగా రేషన్ అక్రమ తరలింపుపై విస్తృత తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో భాగంగా 12వేల క్వింటాళ్ల బియ్యం పట్టుబడిందని ఆయన తెలిపారు. పట్టుబడిన బియ్యం విలువ  సుమారు 3.11 కోట్లు ఉంటుందన్నారు. తొమ్మిది ప్రాంతాల్లో తనిఖీలు చేసి పెద్దఎత్తున బియ్యం పట్టుకున్నామన్నారు. రేషన్ బియ్యాన్ని అమ్ముతున్న వీరిపై క్రిమినల్, పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తామన్నారు.


గతంలో మాదిరి కాకుండా ఈసారి మరింతగా కఠినంగా కేసులు పెట్టనున్నామని ఆయన తెలిపారు. ప్రజల్లో కూడా రేషన్ బియ్యం అమ్ముకోకుండా ఉపయోగించుకునేలా అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతామన్నారు. సార్టెక్స్ బియ్యం అన్నం బాగా ఉంటుందన్నారు. ఇటీవల తనిఖీల్లో ప్రజలతో కలిసి తాను భోజనం చేశానని సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. 


Advertisement
Advertisement