జీజీహెచ్‌లో నాగేంద్రకు కొనసాగుతున్న చికిత్సలు

ABN , First Publish Date - 2020-10-17T17:04:27+05:30 IST

ప్రేమించిన యువతిపై కత్తితో గొంతు కోసి..ఆపై తాను పొడుచుకుని తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబుకు జీజీహెచ్‌లో చికిత్సలు కొనసాగుతున్నాయి.

జీజీహెచ్‌లో నాగేంద్రకు కొనసాగుతున్న చికిత్సలు

గుంటూరు: ప్రేమించిన యువతిపై కత్తితో గొంతు కోసి..ఆపై తాను పొడుచుకుని తీవ్రంగా గాయపడిన నాగేంద్రబాబుకు జీజీహెచ్‌లో చికిత్సలు కొనసాగుతున్నాయి. పొట్ట లోపల భాగాలకు శస్త్రచికిత్సతో రక్తస్రావం నిలిచింది. నాగేంద్ర బీపీ, పల్స్ సాధారణంగానే ఉన్నాయని జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి తెలిపారు. అతని అన్నవాహిక, పేగులకు గాయాలయ్యాయని... వాటిని సరి చేస్తూ వైద్యులు ఆపరేషన్ చేశారన్నారు. గాయాలతో పోయిన రక్తాన్ని మళ్లీ రీప్లేస్ చేశామని చెప్పారు. అతని పరిస్థితి సాదారణ స్థితికి రావడానికి  మూడు వారాలు పడుతుందని డాక్టర్ ప్రభావతి పేర్కొన్నారు. 

Updated Date - 2020-10-17T17:04:27+05:30 IST