Abn logo
Jul 4 2020 @ 18:33PM

గుంటూరు: మాచవరంలో పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళన

గుంటూరు: మాచవరంలో పురుగులమందు డబ్బాలతో రైతుల ఆందోళనకు దిగారు. తురకపాలెం సమీపంలో ఇళ్ల స్థలాల కోసం సేకరించిన భూమిపై వివాదం నెలకొంది. గతంలోనే ఆ భూములకు డీకే పట్టాలు ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. కేటాయించిన భూమిలో సేద్యం చేయకపోవడం వల్లే.. వెనక్కి తీసుకుంటున్నామని మాచవరం తహసీల్దార్‌ చెప్పారు. 30 ఏళ్లుగా భూములను సాగు చేసుకుంటున్నామంటుని రైతులు చెబుతున్నారు. కోర్టు స్టే ఇచ్చినా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement