గుంటూరులో వైద్యుల నిరసన

ABN , First Publish Date - 2021-06-18T16:13:43+05:30 IST

జిల్లాలోని ఐఎంఏ అసోసియేషన్ హల్ వద్ద వైద్యులు నిరసనకు దిగారు.

గుంటూరులో వైద్యుల నిరసన

గుంటూరు: జిల్లాలోని ఐఎంఏ అసోసియేషన్ హల్ వద్ద వైద్యులు నిరసనకు దిగారు. వైద్య సిబ్బందిపై దాడులకు వ్యతిరేకంగా నల్ల రిబ్బన్‌లు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర కార్యదర్శి నంద కిషోర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు పెరిగి పోయాయన్నారు.  నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. .కరోనా సమయంలో సమ్మె చేయడం కరెక్ట్ కాదని నిరసన మాత్రమే తెలియజేస్తున్నామన్నారు. దాడులను అరికట్టడానికి పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలోపతి వైద్యులు, వైద్యంపై రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. రాందేవ్ బాబాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కరోనాతో చనిపోయిన వైద్యులు, వైద్య సిబ్బందికి తగిన ఆర్థిక సాయం అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, ఎన్‌వోసిలు వెంటనే ఇవ్వాలని  నందకిషోర్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-06-18T16:13:43+05:30 IST