దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ఇన్ఫో సోసైటీ

ABN , First Publish Date - 2022-02-17T16:02:20+05:30 IST

ఇక తమకు వివాహం జరగదని అనుకున్న దివ్యాంగులకు ఇన్ఫోసోసైటీ కొత్త జీవితం ఇస్తోంది.

దివ్యాంగుల జీవితాలలో వెలుగులు నింపుతున్న ఇన్ఫో సోసైటీ

గుంటూరు: జీవితంలో ఇక తమకు వివాహం జరగదని అనుకున్న దివ్యాంగులకు ఇన్ఫోసోసైటీ  కొత్త జీవితం ఇస్తోంది. దివ్యాంగులందరినీ ఒక చోటకు చేర్చి వారిలో నచ్చిన జంటలకు వివాహం జరిపిస్తోంది. దివ్యాంగులకు సామూహిక వివాహాలు జరిపించడం ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.


వైకల్యం కారణంగా చాలా మంది దివ్యాంగులు వివాహం కాకుండానే మిగిలిపోతున్నారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు గుంటూరుకు చెందిన నాగశ్రీ ముందుకొచ్చారు. ఇందు కోసం తన భర్త సాయంతో దివ్యాంగుల వివాహ ఇన్ఫోసోసైటీ ఏర్పాటు చేశారు. వైకల్యంతో బాధపడుతూ వివాహం కాకుండా ఉండిపోయిన వారిని గుర్తించి ఈ సొసైటీ ద్వారా ఒకే వేదికపైకి చేర్చి పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారిలో నచ్చిన జంటలకు వివాహం జరిపిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 48 జంటలకు వివాహాలు జరిపించారు.

Updated Date - 2022-02-17T16:02:20+05:30 IST