Abn logo
Sep 23 2021 @ 10:20AM

గుంటూరు: నేడు కొప్పర్రులో హోంమంత్రి పర్యటన

గుంటూరు జిల్లా: కొప్పర్రులో హోంమంత్రి మేకతోటి సుచరిత గురువారం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కొప్పర్రులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ వర్గీయులను పోలీసులు పెదనందిపాడు స్టేషన్‌కు పిలిపించారు. సోమవారం కొప్పర్రులో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. టీడీపీ మాజీ జెడ్పీటీసీ శారద ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో హోంమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.